Avatar 2 OTT: ఓటీటీలోకి బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌.. అవతార్‌ 2 స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Mar 08, 2023 | 3:10 PM

హాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన మరో బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌ ' అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌ (అవతార్‌ 2)'. గతేడాది డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంబాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Avatar 2 OTT: ఓటీటీలోకి బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌.. అవతార్‌ 2 స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Avatar 2
Follow us on

హాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన మరో బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌ ‘ అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌ (అవతార్‌ 2)’. గతేడాది డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంబాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 160 భాషలలో విడుదలైన ఈ సినిమా పుల్‌ రన్‌ల రెండు బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి పార్ట్‌లో పండోరా గ్రహం అందచందాలను చూపించిన కామెరూన్‌ రెండో భాగంలో సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు తెలియజేశారు. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన అవతార్‌ 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ‘అవతార్‌‘ టీం ఓ ట్వీట్‌ చేసింది. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే మొదట కొన్ని రోజుల పాటు వీడియో ఆన్‌ డిమాండ్‌ లేదా అద్దె ప్రాతిపదికను ‘అవతార్‌2’ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ లాంటి అగ్రతారలు నటించారు. ఒక ఇండియాలోనే ఆరు భాషల్లో అంటే.. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఇక వసూళ్ల విషయానికొస్తే.. ఇండియాలో 473 కోట్లకుపైగా గ్రాస్, 391 కోట్ల షేర్ నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..