AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Heist: మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.. విడుదల నేపథ్యంలో ఏకంగా..

Money Heist: ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హెయిస్ట్ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా దేశీయంగా తెరకెక్కే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకోసం...

Money Heist: మనీ హెయిస్ట్‌ వెబ్‌ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.. విడుదల నేపథ్యంలో ఏకంగా..
Money Hiest Web Series
Narender Vaitla
|

Updated on: Sep 02, 2021 | 12:51 PM

Share

Money Heist: ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హెయిస్ట్ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా దేశీయంగా తెరకెక్కే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకోసం జనం ఎదురు చూస్తున్నారంటే అందులో ప్రత్యేకత ఏముండదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన ఓ వెబ్‌ సిరీస్‌కు భారత్‌లోనూ అభిమానులు ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే తాజాగా మనీ హెయిస్ట్‌ ఫైనల్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా జైపూర్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ సిరీస్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే.. జైపూర్‌కు చెందిన వెర్వి లాజిక్‌ అనే ఐటీ కంపెనీ మనీ హెయిస్ట్‌ ఫైనల్‌ సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో సెప్టెంబర్‌ 3న సెలవు ప్రకటించింది. అంటే ఈ కంపెనీ ఉద్యోగులకు ఈ వీకెండ్‌ మూడు రోజులు రానుందన్నమాట. దీంతో ఉద్యోగులంతా మూడు రోజుల్లో సిరీస్‌ మొత్తం చూసుకునేలా కంపెనీ అవకాశం కలిపించింది. నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ చిల్‌ హాలీడే పేరుతో సెలవు ప్రకటిస్తూ కంపెనీ సర్కులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఈ సర్కులర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లేఖలో.. ‘అందరూ ఒకేసారి మానేస్తారు. అందుకు వేర్వేరు కారణాలు చెబుతారని మాకు అర్థమైంది. దీన్ని నివారించేందుకే నేనే ముందుగా సెలవు ఇచ్చేస్తున్నా’ అని కంపెనీ సీఈవో పేర్కొన్నారు.

నెట్టింట వైరల్ అవుతోన్న లేఖ..

Letter

Also Read: TS EAMCET 2021: విద్యార్థులకు కీలక సూచన.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..

Teacher-Delivery Boy: ఒకప్పుడు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన టీచర్.. నేడు బ్రతుకు పోరాటంలో డెలివరీ బాయ్‌గా..

Samsung Galaxy A52s: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌… అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

Follow Us
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి