AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రక్తం ఇస్తే డబ్బులిచ్చే దెయ్యం కుర్చీ.. OTTలో భయపెడుతోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ఫ్రీగా చూడొచ్చు

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియెన్స్ ను భయపెడుతూ టాప్ లో ట్రెండ్ అవుతోంది.

OTT Movie: రక్తం ఇస్తే డబ్బులిచ్చే దెయ్యం కుర్చీ.. OTTలో భయపెడుతోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ఫ్రీగా చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 30, 2026 | 8:04 PM

Share

థియేటర్లలో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అవుతుంటాయి. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటలేని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై మాత్రం రికార్డు వ్యూస్ తెచ్చుకుంటుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను మాత్రం బాగా భయపెడుతోంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రధాన పాత్రధారుడైన విక్రమ్ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అతను క్రికెట్ బెట్టింగ్, ఇతర జూదాలకు అలవాటు పడి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతాడు. దీంతో ఈజీ మనీ కోసం తాను పని చేసే కంపెనీకి చెందిన డబ్బులను కొట్టేసి క్రికెట్ బెట్టింగ్ లో పెడతాడు. అయితే ఈ మోసం బయటపడడంతో కంపెనీ యాజమాన్యం విక్రమ్‌ను ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా పోలీస్ కేస్ పెడుతుంది. ఇలాంటి సమయంలో విక్రమ్ కు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది అతని ప్రియురాలు రుధి. అలా ఒకరోజు ఆమె ఎంతో ఇష్టపడి ఒక పురాతన యాంటిక్ చైర్ ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వస్తుంది. అయితే ఆ కుర్చీకి ఒక దుష్టశక్తి ఆవహించి ఉంటుంది. అది కేవలం విక్రమ్ కు మాత్రమే కనిపిస్తుంటుంది. అతని బలహీనతలను ఆసరాగా చేర్చుకున్న ఆ దుష్టశక్తి అడిగినప్పుడల్లా కొన్ని షరతులతో డబ్బు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అసలు ఆ కుర్చీ నేపథ్యమేంటి?చివరికి ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.

ప్రస్తుతం 2 ఓటీటీల్లో ఆకట్టుకుంటోన్న ఈ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది డెవిల్స్ చైర్’ (The Devil’s Chair). కొత్త దర్శకుడు గంగ సప్తశిఖర తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జబర్దస్త్ స్టార్ కమెడియన్ అదిరే అభి ఇందులో హీరోగా నటించాడు. స్వాతి మందల్ హీరోయిన్ గా నటించింది. ఛత్రపతి శేఖర్, వెంకట్ దుగ్గిరెడ్డి, అద్విత చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అదే సమయంలో యూట్యూబ్‌లోనూ ది డెవిల్స్ చైర్ సినిమా అందుబాటులో ఉంది. కాబట్టి మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారు యూట్యూబ్ లో ఈ సినిమాను ఫ్రీగా చూసేయవచ్చు.

ది డెవిల్స్ ఛైర్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us