Animal OTT: అఫీషియల్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో యానిమల్‌.. అదనపు సీన్స్‌తో కలిసి స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. గతేడాది థియేటర్లలో రిలీజై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఒక సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ తో విజిల్స్‌ వేయించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. అదే బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌.

Animal OTT: అఫీషియల్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో యానిమల్‌.. అదనపు సీన్స్‌తో కలిసి స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Animal Movie

Updated on: Jan 25, 2024 | 12:04 PM

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. గతేడాది థియేటర్లలో రిలీజై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఒక సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ తో విజిల్స్‌ వేయించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. అదే బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రీ మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్‌ విలన్‌ గా మెప్పించగా, రణ్‌ బీర్‌ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ మెరిశారు. డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను సాధించింది. ఓవరాల్‌గా రూ. 900 కోట్ల మేర వసూళ్లు రాబట్టి గతేడాది బాలీవడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేసిన యానిమల్‌ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. గణతంత్ర దినోత్సవం కానుకగా శుక్రవారం (జనవరి 26 నుంచి) యానిమల్‌ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటన రిలీజ్‌ చేసింది నెట్‌ఫ్లిక్స్‌. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే యానిమల్‌ మూవీ ఓటీటీలోకి రానుందన్నమాట.

కాగా థియేటర్లలో యానిమల్‌ మూవీ చూసిన వారికి మరింత సర్‌ప్రైజ్‌ జోడించి ఓటీటీ వెర్షన్‌ అందించనున్నారు. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీనిని . థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించింది నెట్‌ఫ్లిక్స్‌. మూవీ రన్‌ టైమ్‌ 3 గంటల 21 నిమిషాలు కాగా, ఓటీటీ కోసం అదనపు సన్నివేశాల జోడించడంతో దాదాపు మూడున్నర గంటలతో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సహా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ మూవీ కోసం పని చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఈరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.