Bharateeyudu 2 OTT: అఫీషియల్.. భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Aug 04, 2024 | 2:40 PM

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం 'భారతీయుడు 2'. దాదాపు 28 ఏళ్ల (1996)క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలలో మెరిశారు

Bharateeyudu 2 OTT: అఫీషియల్.. భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Bharateeyudu 2
Follow us on

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘భారతీయుడు 2’. దాదాపు 28 ఏళ్ల (1996)క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలలో మెరిశారు. భారీ అంచాలతో జులై 12న థియేటర్లలో విడుదలైన భారతీయుడు 2 సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. మొదటి పార్ట్ మ్యాజిక్ ను కొనసాగించలేక చతికిలపడింది. భారీ తారాగణం, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఉన్నప్పటికీ నీరసమైన కథా, కథనాలు భారతీయుడు 2 సినిమాను దెబ్బ తీశాయని రివ్యూలు వచ్చేశాయి. అయితే తమిళంలో ఈ సినిమాకు భారీగానే వసూళ్లు వచ్చాయి. కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే భారతీయుడు 2 సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 నుంచి కమల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ సుమారు రూ. 250 కోట్లతో భారతీయుడు 2 సినిమాను నిర్మించారని టాక్. అయితే ఓవరాల్ గా ఈ సినిమా రూ.130 కోట్లను మాత్రమే రాబట్టిందని సమాచారం.మొదట ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఓటీటీలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఇప్పుడీ తేదీ మార్చారు. ఒక వారం ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.