Manjummel Boys OTT: మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన హాట్ స్టార్.. అసలు ట్విస్ట్ ఇదే..

ఫిబ్రవరి 22న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇటీవలే తెలుగులో రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, గణపతి, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Manjummel Boys OTT: మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన హాట్ స్టార్.. అసలు ట్విస్ట్ ఇదే..
Manjummel Boys Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2024 | 2:48 PM

ఇటీవల కొన్ని రోజులుగా మలయాళంలో తెరకెక్కిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో మంజుమ్మెల్ బాయ్స్ ఒకటి. డైరెక్టర్ చిదంబరం రచించి దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఫిబ్రవరి 22న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇటీవలే తెలుగులో రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, గణపతి, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తుంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. కేవలం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు రూమర్ మాత్రమే. అయితే తాజాగా మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది హాట్ స్టార్.

మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ మాత్రం హాట్ స్టార్ లోనే అని కన్ఫార్మ్ చేశారు మేకర్స్. కానీ మే 3నే రిలీజ్ డేట్ అన్నట్లు మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే మంజుమ్మెల్ బాయ్స్ మూవీ విడుదల కాబోతుందని తెలిపింది. మే 3న స్ట్రీమింగ్ కానుందనే వార్తలలో మాత్రం ఎలాంటి నిజం లేదని మరోసారి క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు పైగా వసూలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.