OTT Movie: 1500 కోట్లకు పైగా వసూళ్లు.. అత్యంత భయానక రియల్ స్టోరీ.. డిసెంబర్ 31 తరువాత ఓటీటీ నుంచి డిలీట్

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది . ఈ క్రమంలో కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్న తరుణంలో సినిమాలకు వీడ్కోలు పలుకుతున్నాయి ఓటీటీ సంస్థలు. అలా డిసెంబర్ 31 తర్వాత ఓటీటీలో డిలీట్ కానున్న సినిమాల్లో ఈ భయంకరమైన హారర్ థ్రిల్లర్ కూడా ఉంది.

OTT Movie: 1500 కోట్లకు పైగా వసూళ్లు.. అత్యంత భయానక రియల్ స్టోరీ.. డిసెంబర్ 31 తరువాత ఓటీటీ నుంచి డిలీట్
The Exorcism of Emily Rose Movie

Updated on: Dec 18, 2025 | 8:00 PM

2025 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ తమ తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఓటీటీ సంస్థలు డిసెంబర్ 31 తర్వాత కొన్ని సినిమాలను డిలీట్ చేయనున్నాయి. కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇలా పాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాయి. అలా డిసెంబర్ 31 తర్వాత ఓటీటీలో డిలీట్ కానున్న సినిమాల్లో ఒక భయానక హారర్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ఒకవేళ ఇంకా చూడకపోతే డిసెంబర్ 31కి ముందే ఈ మూవీపై ఒక లుక్కేయండి. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,150 కోట్లు సాధించింది. అలాగే IMDbలో టాప్ రేటింగ్‌ను సంపాదించుకన్న ఈమూవీకి ఉత్తమ హర్రర్ చిత్రంగా అవార్డు కూడా వచ్చింది.

ఈ సినిమా కథ మొత్తం 23 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది. ఉన్నట్లుండి అమ్మాయికి వింత స్వరాలు వినిపిస్తాయి.
శరీరానికి గాయాలు అవుతాయి. క్రమంగా ఆమె ప్రవర్తన కూడా వింతగా మారుతుంది. దీంతో ఆ అమ్మాయి భూతవైద్యం చేయించుకుంటుంది. కానీ కొంతకాలం తర్వాత ఆమె చనిపోతుంది. మరి ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమెను నిజంగా దుష్టశక్తులు పట్టి పీడించాయా? లేదా? ఆమె మందులు ఎందుకు తీసుకోలేదు? ఆమె చావుకు కారణం ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా పేరు ‘ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ (The Exorcism of Emily Rose) . అత్యంత భయానకరమైన సినిమాగా పేరు పొందిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే డిసెంబర్ 31 తర్వాత ఈ మూవీ ఓటీటీ నుంచి డిలీట్ కానుంది. కాబట్టి చూడని వారుంటే వెంటనే చూసేయడం బెటర్.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.