OTT Movie: వామ్మో.. ఇదేం సినిమా రా బాబూ.. వణుకుపుట్టించే ట్విస్టులు.. ఓటీటీలో హారర్ మూవీ రచ్చ..

హారర్ సినిమాలు చూడడం ఇష్టమా.. ? అయితే ఇప్పుడు ఈ హారర్ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. స్టా్ర్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సినిమా.. వణుకుపుట్టించే ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు 3 భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది ఈ హారర్ సినిమా.

OTT Movie: వామ్మో.. ఇదేం సినిమా రా బాబూ.. వణుకుపుట్టించే ట్విస్టులు.. ఓటీటీలో హారర్ మూవీ రచ్చ..
Kuntilanak 2

Updated on: May 18, 2025 | 3:24 PM

సినీప్రియులు ఈమధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీల్లో హారర్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి మనిషి కామన్ ఎమోషన్ అయిన భయాన్ని బేస్ తెరకెక్కించే సినిమలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇటీవల ఇలాంటి జానర్ చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఆద్యంతం వెన్నులో వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ తెలుగు హారర్ థ్రిల్లర్. అదే కుంటిలానక్ 2. ఇది ఒక ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్.

ఇండోనేషియా భాషలో గర్భంతో చనిపోయి దెయ్యమైన వారిని కుంటిలానక్ అని అంటారు. అలాగై మనుషుల రక్తం తాగేవాళ్లను పిశాంచి, వాంపైర్ అంటారు. ఈ సినిమాలో వాంపైర్ దెయ్యం ఉంటుంది. అతీంద్రియ శక్తులు కలిగిన ఆత్మ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే జియో హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది ఈ మూవీ. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలో ఎలాంటి సబ్ టైటిల్స్ లేకుండా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

నిజానికి ఈ సినిమా 2019 అక్టోబర్ లో థియేటర్లలో విడుదలైంది కుంటిలానక్ 2. అదే ఏడాది ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కేవలం ఇండోనేషియా భాషలోనే అందుబాటులో ఉండేది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో భయానక సంఘటనలు, వణుకుపుట్టించే ట్విస్టులు, ఆద్యంతం కట్టిపడేసే సీన్స్ తో ఈ సినిమా సాగుతుంది. మనుషుల రక్తం తాగే వాంపైర్, పిల్ల పిశాచాలతో ఈ సినిమా సాగుతుంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..