ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డరీ మిస్టరీ చిత్రాలు చూసేందుకు మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ప్రేక్షకులను భయపెట్టే హరర్ మూవీస్ తీసుకువచ్చేందుకు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ, థ్రిల్లింగ్, భయపెట్టే సన్నివేశాలతో మూవీస్, వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హారర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హారర్ కామెడీ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే మంజ్యా. బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని జూన్ 7న విడుదల చేయగా.. దాదాపు రూ.131.57 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవైపు వణుకుపుట్టించే సస్పెన్స్.. మరోవైపు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి రోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
వారం రోజులు పూర్తికాకముందే రూ.23 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం రూ.131 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్ దార్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ బ్యూటీ శర్వారి వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్య రాజ్ కీలకపాత్రలు పోషించారు. మంజ్యా అంటే మరాఠీ భాషలో ఉపనయనం అని అర్థం. హిందువులలో మగ పిల్లలకు కౌమరదశ కంటే ముందు అంటే వేదాభ్యాసానికి కంటే ముందు చేసే ఉపనయనమే ఇది. అయితే మంజ్యా చేస్తున్న మధ్యలోనే ఓ పిల్లవాడు దెయ్యంగా మారతాడు. ఈ సినిమాకు హీరోకు మాత్రమే ఆ పిల్ల దెయ్యం కనిపిస్తుంది. కొన్నిసార్లు అతడు చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. అలాగే వెన్నులో వణుకుపుటిస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. వచ్చే నెలలో రెండో వారంలో ఈ మూవీ అందుబాటులోకి రానుందని సమాచారం. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.