Aha Godari: ఆహా ‘గోదారి’ కి అరుదైన గౌరవం.. ఢిల్లీ ఏపీ భవన్‌లో డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన

|

May 13, 2023 | 7:35 AM

శ్రీరామనవమి కానుకగా మార్చి 30న రిలీజైన ఆహా గోదారి డాక్యుమెంటరీకి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. లక్షలాది మంది ఈ డాక్యుమెంటరీని వీక్షించి సూపర్బ్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా 'ఆహా గోదారి' డాక్యుమెంటరీకి అరుదైన గౌరవం లభించింది.

Aha Godari: ఆహా గోదారి కి అరుదైన గౌరవం.. ఢిల్లీ ఏపీ భవన్‌లో డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన
Aha Godari
Follow us on

భారతదేశంలో ఎంతో విశిష్ఠ స్థానం కల్గిన గోదావరి నదిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆహా గోదారి’. గోదావరి నది చరిత్ర, దాని పరివాహక ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించారు దర్శకురాలు స్వాతి దివాకర్‌. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది, యానాం వరకు సాగే గోదావరి నది ప్రయాణాన్నిఇందులో చూపించారు. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న రిలీజైన ఆహా గోదారి డాక్యుమెంటరీకి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. లక్షలాది మంది ఈ డాక్యుమెంటరీని వీక్షించి సూపర్బ్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీకి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం (మే12) సాయంత్రం ఈ డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఆహా గోదారి డాక్యుమెంటరీ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీలోని తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహా పీఆర్వో అభ్యుదయ మాట్లాడుతూ ‘ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కంటెంట్ తీసుకొస్తుంది. తొలిసారిగా సమాచారంతో కూడిన ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీని శ్రీరామ నవమి సందర్భంగా తీసుకొచ్చాం. స్వాతి దివాకర్ ఈ డాక్యుమెంటరీని మూడేళ్లు కష్టపడి రూపొందించారు. గోదావరి గురించి మనకే తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. కేవలం హిందువులకు మాత్రమే కాదు, అనేక మతస్థులకు గోదావరితో అనుబంధం ఉంది. డాక్యుమెంటరీని ప్రదర్శించాలంటూ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మొదటిసారిగా ఆహా గోదారి డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటుచేశాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఏపీ భవన్ అధికారులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..