OTT Movie: థియేటర్లలో 2000 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. ఐఎండీబీ టాప్ రేటింగ్ మూవీ

ఇప్పుడు ఎక్కడైనా సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకే ఆడియెన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ..

OTT Movie: థియేటర్లలో 2000 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. ఐఎండీబీ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie

Updated on: Sep 06, 2025 | 9:26 PM

ఇప్పుడు థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. చిన్న సినిమాలకు అయితే గ్యాప్ కూడా ఉండడం లేదు.ఇక మోస్తరు విజయం సాధించిన సినిమాలు 45 రోజులకు అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలయితే 2 నెలలు.. మొత్తానికి ఎలాంటి సినిమా అయినా 30, 45 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే సినిమా విషయంలో కాస్త డిఫరెంట్. ఆగస్టు 08 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం సినిమా రూ. 2000 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను సుమారు రూ.335 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ మూవీ 23.5 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. అసలు మూవీ స్టోరీనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే క్లాస్ కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వాళ్లందరూ ఒకే రాత్రి ఒకే సమయానికి మామయైపోతారు. ఇది అక్కడి వాళ్లకు అంతుబట్టదు. అసలు విద్యార్థులు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారన్నది తెలుసుకోవడమే సినిమా కథ. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉంది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోంది. అయితే అప్పుడే సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి ఇది వీడియో ఆన్ డిమాండ్ గా రానుంది. అంటే సినిమా చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు వెపన్స్. జాక్ క్రెగర్ తెరకెక్కించి నీ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి టాప్ స్టార్స్ నటించారు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోన్న వెపన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అది కూడా ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.