
గత వారం చాలా సినిమాలు, సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక తమిళ థ్రిల్లర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిపోయింది. యాక్షన్ ప్రియులను అలరిస్తోన్న ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. తమిళ జనాలకు బాగానే నచ్చేసింది. ఈ సినిమా కథ కూడా కొత్తగా ఉంటుంది. చెన్నై సముద్ర తీరం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. సముద్ర తీరంలో 17 కిలోమీటర్ల మేర ప్రభుత్వం ఒక పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది. సముద్రంలోని క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసందుకు ఈ పైప్ లైన్ ను అమరుస్తారు. అయితే ఈ పైప్ లైన్ కారణంగా జాలరులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో అక్కడి స్థానికులు ఉద్యమిస్తారు. ఈ పోరాటంలో ఢిల్లీ బాబు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. అనాథగా మారిన అతని కొడుకు వాసుదేవను విలన్ మనోహర్ చేరదీస్తాడు. క్రూడ్ ఆయిల్ ను దొంగతనం చేసి అమ్ముతుంటాడు మనోహర్. వాసుదేవ కూడా ఇదే పని చేస్తూ గ్రామాలను ఆదుకుంటాడు.
అయితే ఇక్కడే విలన్ తన దొంగ బుద్ధి చూపిస్తాడు. ఆత్యాశతో హీరోను ఇబ్బందుల్లోకి నెట్టుతాడు? మరి హీరో ఏం చేశాడు? విలన్ ను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు డీజిల్. హరీష్ కల్యాణ్, అతుల్యా రవి, సాయి కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఏకంగా నాలుగు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్, సింప్లీ సౌత్, ఆహా తమిళ్ ఓటీటీల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో డీజిల్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
The engine heat stays high 🔥 Thodarum #Diesel aataam ❤️🔥#Diesel continues as the Trending #1 movie in India 📈 Stream it now on @PrimeVideoIN
▶️ https://t.co/NpEM2ht2Ra#DieselOnPrime @iamharishkalyan @AthulyaOfficial @shan_dir @ThirdEye_Films @devarajulu29 @thespcinemas pic.twitter.com/uY659RgEno
— Third Eye Entertainment (@ThirdEye_Films) November 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.