ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే ఓ మలయాళ సినిమా మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే హకీమ్ షాజహాన్ నటించిన ‘కడకన్’. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా ఈ తెరకెక్కిన ఈ మూవీ గతేడాది మార్చిలో థియేటర్లలో విడుదలైంది. మలయాళ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. అయితే థియేటర్లలో విడుదలై సుమారు పదినెలల గడిచినా కడకన్ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే శుక్రవారం (జనవరి 03) అర్ధరాత్రి నుంచి ఈ యాక్షన్ రివేంజ్ డ్రామా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. కడకన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.
సాజిల్ మాంపాడ్ తెరకెక్కించిన కడకన్ సినిమాలో జాఫర్ ఇడుక్కి, హరిశ్రీ అశోకన్, నిర్మల్ పాలాజి, మణికందన్ ఆచారి, టీజీ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా మన దేశంలోనే నాణ్యమైన ఇసుక కేరళలోని మల్లపురం ప్రాంతంలో దొరుకుతుంది. ఇదే క్రమంలో ఇసుక మాఫియా వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రతీకార ఘటనలను తెరపై దర్శకుడు అద్భతంగా చూపించాడు. స్నేహం, ప్రేమ, యాక్షన్ అంశాలను ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. మరి మీకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ వీకెండలో కడకన్ సినిమా మీకు మంచి ఛాయిస్.
Malayalam film #Kadakan (2024) by #SajilMampad, ft. #HakimShajahan #SonaOlickal #SarathSabha #HarisreeAshokan #JafferIdukki #ManikandanRAchari & #BibinPerumbilli, now streaming on @sunnxt.
— CinemaRare (@CinemaRareIN) January 3, 2025
a pointless, clueless film with old-school wannabe forced action sequences
crap#HakkimShah pic.twitter.com/9D6t97f2eB
— Manu Thankachy (@manuthankachy) January 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.