Guppedantha Manasu Jagathi: ‘ప్రెట్టీ గర్ల్’గా మారిన సీరియల్ బ్యూటీ.. లుక్ మార్చేసిన జగతి మేడమ్..

|

Sep 27, 2023 | 2:13 PM

జగతి అసలు పేరు జ్యోతిరాయ్. సీరియల్లో మేడమ్ పాత్రకు తగినట్లుగా సంప్రదాయంగా కట్టు బొట్టుతో అలరించే జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తిగా విభిన్నం. మేడమ్ పాత్రకు ఫుల్ రివర్స్ గా స్టైలీష్.. గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె ఫోటోస్ చూస్తే జగతి మేడమ్ ఆమె కాదేమో అనే సందేహం కచ్చితంగా రావాల్సిందే. కొద్ది రోజులుగా జగతి తన ఇన్ స్టా ఖాతాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంది.

Guppedantha Manasu Jagathi: ప్రెట్టీ గర్ల్గా మారిన సీరియల్ బ్యూటీ.. లుక్ మార్చేసిన జగతి మేడమ్..
Jyothi Rai
Follow us on

బుల్లితెరపై ప్రస్తుతం నెంబర్ వన్ సీరియల్‏గా దూసుకుపోతుంది ‘గుప్పెడంత మనసు’. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‏కు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా ఇందులోని మెయిన్ రోల్స్ రిషి, వసుధార పాత్రలు ఎంతగా ఫేమస్ అయ్యాయో.. అంతకు మించి పాపులారిటిని సొంతం చేసుకుంది జగతి. ఈ సీరియల్ లో రిషి తల్లిగా విలక్షణమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే జగతి అసలు పేరు జ్యోతిరాయ్. సీరియల్లో మేడమ్ పాత్రకు తగినట్లుగా సంప్రదాయంగా కట్టు బొట్టుతో అలరించే జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తిగా విభిన్నం. మేడమ్ పాత్రకు ఫుల్ రివర్స్ గా స్టైలీష్.. గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె ఫోటోస్ చూస్తే జగతి మేడమ్ ఆమె కాదేమో అనే సందేహం కచ్చితంగా రావాల్సిందే. కొద్ది రోజులుగా జగతి తన ఇన్ స్టా ఖాతాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంది.

తాజాగా జగతి మేడమ్ ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ రూపొందుతుందని తన ఇన్ స్టా ద్వారా తెలిపింది. రాహుల్ దీపక్ దర్శకత్వం వహిస్తోన్న ‘ది ప్రెట్టీ గర్ల్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. ఇందులో జ్యోతి రాయ్ ఫుల్ గ్లామర్ గర్ల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇటీవల కొద్ది రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తోంది. జ్యోతికి పెళై ఒక బాబు కూడా ఉన్నాడని.. కానీ కొంతకాలంగా ఆమె ఓ యంగ్ దర్శకుడితో ప్రేమలో ఉందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇటీవల తన ఇంటిపేరు మార్చుకుని ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడంతో ఈ వార్తలకు మరింత చేకూరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.