OTT: బాస్‌ను హత్య చేసిందెవరు? ఓటీటీలో సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. దిమ్మతిరిగే ట్విస్టులు.. ఇప్పుడు తెలుగులోనూ..

|

Oct 27, 2024 | 6:18 PM

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసినా మంచి కంటెంట్ ఉంటుంది. పైగా మాలీవుడ్ సినిమాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరూ ఈ మలయాళ సినిమాలను ఆదరిస్తుంటారు.

OTT: బాస్‌ను హత్య చేసిందెవరు? ఓటీటీలో సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. దిమ్మతిరిగే ట్విస్టులు.. ఇప్పుడు తెలుగులోనూ..
Golam Movie
Follow us on

తెలుగు ఆడియెన్స్ కోసం మరో సూపర్ హిట్ మలయాళ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే రంజిత్ సంజీవ్ దిలీశ్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన గోళం.సంజాద్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మర్డర్ మిస్టరీ మూవీ మలయాళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కథా కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఓటీటీలోనూ ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన గోళం సినిమాకు భారీ వ్యూస్ వచ్చాయి. అయితే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు మరింత ఎక్కువ రీచ్ ఉండేందుకు మరో నాలుగు భాషల్లోనూ గోళం చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల వెర్షన్లు కూడా స్ట్రీమింగ్ కు వచ్చాయి. మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

గోళం మూవీలో రంజిత్ సంజీవ్, దిలీశ్‍తో పాటు సన్నీ వైన్, అలెన్సియర్ లే లోపేజ్, సిద్దిఖీ, చిన్నూ చాందినీ, శ్రీకాంత్ మురళి, అన్సల్ పల్లరుతీ, సుధి కోజికోడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అన్నే సంజీవ్, సంజీవ్ పీకే ఈ సినిమాను నిర్మించారు. అబీ సాల్విన్ థామస్ బాణీలు సమకూర్చగా, విజయ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఇక ‘గోళం’ కథ విషయానికొస్తే.. సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో సాగుతుంది. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ మర్డర్ సంచలనం రేపుతుంది. దీంతో ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. మరి జాన్ ఎవరు చంపారు? కిల్లర్ ఎలా దొరికాడు? అన్నది తెలుసుకోవాలంటే గోళం సినిమా చూడాల్సిందే. ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలపై ఆసక్తి ఉన్న వారు ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న గోళం..

గోళం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.