అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు దేశమంతా ఎన్నికలు, ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారం కూడా సుహాస్ ‘ప్రసన్నవదనం’, ‘కృష్ణమ్మ’, ‘జితేందర్ రెడ్డి’ వంటి చిన్న సినిమాలే థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం చాలా వరకు కొత్త సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఈ వారం అందరి దృష్టి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మీదనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల థియేటర్లలోనూ భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ షైతాన్ కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఇక అరడజను మంది హీరోయిన్లతో సంజయల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరా మండి వెబ్ సిరీస్ కూడా ఈ వారం స్ట్రీమింగ్ లిస్టులో ఉంది. వీటితో పాలు పలు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.