ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. మొత్తం ఐదు భాగాలు ఉన్న నవలను రెండు పార్ట్స్‌గా తీసుకువస్తున్నారు. హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ప్రధాన పాత్రలలో నటించిన ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చోళ రాజవంంశం వారసత్వం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. ఓవర్సీస్ సహా పలు ఏరియాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకిచ్చారు మేకర్స్.
పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 4న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అమెజాన్ ప్రైమ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అక్టోబర్ 30న ముందస్తు యాక్సెస్ ప్రారంభించింది. అంటే ప్రస్తుతం వినియోగదారులు యాక్సెస్ ద్వారా ఈ చిత్రాన్ని చూసేందుకు వీలుంటుంది. ఇక తర్వాత నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్ లో వినయోగదారులందరికీ ఈ చిత్రం ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దీంతో ప్రైమ్ మెంబర్స్ మేకర్స్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
థియేట్రికల్ రన్ టైమ్ ముగిసిన వెంటనే సినిమా యాక్సెస్ చేసుకునేందుకు స్ట్రీమింగ్ కోసం సబ్ స్క్రైబ్ చేసుకున్నామని.. అలాగే… ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మళ్లీ యాక్సెస్ చేశామని.. ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంటుందని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ హిందీ వెర్షన్ నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
presenting the much awaited, larger than life, historical action-drama
#PS1onPrime, rent to watch now!
Coming to Prime on Nov 4#ManiRatnam @arrahman @MadrasTalkies_ @LycaProductions@tipsofficial pic.twitter.com/Cq34q7zdD7— prime video IN (@PrimeVideoIN) October 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.