OTT Movie: దృశ్యం సినిమాను మించిన సస్పెన్స్.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూడడం చాలా మంది ఆసక్తి ఉంటుంది. అందుకే ఈమధ్య ఓటీటీలో ఎక్కువగా ఈ జానర్ చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఒక సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి రోజు రోజుకీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..

OTT Movie: దృశ్యం సినిమాను మించిన సస్పెన్స్.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
Eleven Movie

Updated on: Jun 18, 2025 | 9:24 PM

మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూడడం మీకు ఇష్టమా.. ? అయితే ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈరోజుల్లో ఓటీటీల్లో ఇలాంటి జానర్ చిత్రాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టాప్ 10 జాబితాలో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. అంతేకాదు.. దృశ్యం, అంధాధున్ చిత్రాల కంటే ఎక్కువ బాగుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘ఎలెవెన్’. ‘ఎలెవెన్’ సినిమా 2025లో అత్యుత్తమ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదలైంది. లోకేష్ అజలేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 16, 2025న థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అభిరామి, రవివర్మ, కీర్తి, శశాంక్ , రియా నటించారు. దీని కథ మొత్తం కవల తోబుట్టువులను లక్ష్యంగా చేసుకుని, ప్రతి కవల తోబుట్టువులలో ఒకరిని దారుణంగా హత్య చేసే ఒక క్రేజీ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది.

సినిమా ప్రారంభంలో, ముసుగు ధరించిన ఒక వ్యక్తి కారు నుండి దిగి, ట్రంక్ నుండి మృతదేహాన్ని తీసి కాల్చివేస్తున్నట్లు కనిపిస్తుంది. పోలీస్ అధికారి అరవింద్ (నవీన్ చంద్ర) ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తాడు. దర్యాప్తు సమయంలో హంతకుడు కవల సోదరులతో మృత్యువు ఆట ఆడుతున్నాడని అరవింద్ తెలుసుకుంటాడు. హంతకుడు ముసుగు ధరించి హత్య చేస్తాడు, కానీ అరవింద్ త్వరలోనే హంతకుడి పేరు తెలుసుకుంటాడు. విరామం తర్వాత, సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుంది

క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ రివిలేషన్ ఉంటుంది. 2 గంటల 34 నిమిషాలు మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మిమ్మల్నీ ఆధ్యంతం కట్టిపడేస్తుంది. ఇక క్లైమాక్స్ లో హీరోగా భావించే వ్యక్తి నిజమైన విలన్‌గా మారతాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..