Keedaa Cola Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ ‘కీడా కోలా’.. కానీ వారికి మాత్రమే..

|

Dec 28, 2023 | 10:06 AM

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న తరుణ్.. మరోసారి కీడా కోలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో బ్రహ్మానందం, చైతన్య మందాడి, రాగ్ మయుర్ ప్రధాన పాత్రలలో నటించారు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దగ్గుబాటి రానా సమర్పణలో నిర్మించారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ తోపాటు.. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది

Keedaa Cola Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ కీడా కోలా.. కానీ వారికి మాత్రమే..
Keedaa Cola
Follow us on

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ‘కీడా కోలా’ ఒకటి. డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం నవంబర్ 3న విడుదలైంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న తరుణ్.. మరోసారి కీడా కోలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో బ్రహ్మానందం, చైతన్య మందాడి, రాగ్ మయుర్ ప్రధాన పాత్రలలో నటించారు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దగ్గుబాటి రానా సమర్పణలో నిర్మించారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ తోపాటు.. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ హోల్డర్లకు మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. మిగిలిన సబ్ స్క్రైబర్లకు రేపటి నుంచి (డిసెంబర్ 29) నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

కీడా కోలా కథ విషయానికి వస్తే..

వాస్తు (చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. ఆ సమస్య నుంచి బయటపడాలంటే అతనికి డబ్బు అవసరం. అలాగే జీవన్ (జీవన్ కుమార్) అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్ కావాలి. అందుకు డబ్బు అవసరం. తాత వరదరాజులు (బ్రహ్మానందం) కోసం తెచ్చిన కూల్ డ్రింక్ లో బొద్దింక కనిపిస్తుంది. దీంతో సదరు శీతల పానీయం కంపెనీ నుంచి డబ్బులు తీసుకుందామని ప్లాన్ చేస్తాడు. ఈ ముగ్గురికి డబ్బు ఎలా చేరింది.. వీరంతా కలిసి వేసిన ప్లాన్స్ ఏంటీ.. కూల్ డ్రింక్ కంపెనీవాళ్లను బెదిరించి వాస్తు అండ్ బ్యాచ్ డబ్బులు తీసుకున్నారా ? లేదా ? అనేది సినిమా. కీడా కోలా ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.