
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా అర్ధరాత్రి నుంచే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.ఇందులో ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. దీపావళి పండగ కానుకగా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్.. ఇలా అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. దీనికి తోడు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణలు చెబుతున్నారు. ఐఎమ్‌డీబీలోనూ ఈ సినిమాకు 8.3/ 10 రేటింగ్ ఉండడం విశేషం. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం (నవంబర్ 21) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. రజిషా విజయన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి (నవంబర్ 21) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#Bison Netflix Official Poster
Streaming In: HD • 4K • HDR • Dolby Vision • Dolby 5.1
Streaming From: 21 November 12:00AM#BisonOnNetflix pic.twitter.com/QNohRW3jy6— AMAR (@AgentAMAR_) November 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.