
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్.. ఇలా ఓ కమర్షియల్ సినిమాకు కావల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బైసన్. మారి సెల్వరాజ్ తెరకెక్కంచిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. రజిషా విజయన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
Kabaddi nammuluku vena oru game ah irukalam, aana Kittanukku adhaan life eh 🔥💪 pic.twitter.com/DeZoMlOG5l
— Netflix India South (@Netflix_INSouth) November 17, 2025
బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 21 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్.
Perfect Film
Perfect Cuts
Perfect Songs
Perfect Making
Perfect Bgms
Perfect Dialogues
Perfect COMEBACK #Bison 🖤🎬pic.twitter.com/vonEdhOYub— Suresh (@Suresh_00S) November 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.