
ఇతర జానర్లతో పోల్చుకుంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లకు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ఒరిజినల్స్, వెబ్ సిరీస్ అంటూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్ కు అత్యంత వేగంగా 10 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదయ్యాయని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఛేదించారన్న దాని చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు ఏసీపీ అశ్విన్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతనికి సపోర్ట్‌గా మరో ఏపీసీ కూడా రంగంలోకి దిగుతాడు. మరి అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? అసలు హంతకుల ఉద్దేశమేంటి?మర్డర్స్ వెనక క్షుద్రపూజలు, నరబలులు ఏమైనా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ పేరు ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లామ్ లో ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఐదు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఈ శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి నుంచే 6-8 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ క్రైమ్ సిరీస్ లో అశ్విన్, శ్రీతు, పదని కుమార్, ప్రీతి శర్మ, గురు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జెస్విని ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
New suspects. New twists. New revelations.
Watch #DhoolpetPoliceStation now only on #aha
Every Friday – New Episodes pic.twitter.com/72mc7t0lRq— ahavideoin (@ahavideoIN) December 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.