OTT Movie: బాబోయ్.. ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు డిమాండ్.. చూస్తే.. ఓటీటీలో సంచనలం ఈ సిరీస్..

ఒక్క వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టించింది. 2022లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ కోసం ఓ నటుడు భారీగా పారితోషికం తీసుకున్నాడు. ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.18 కోట్లు తీసుకున్నాడట. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్.. ? ఎవరా హీరో ? తెలుసుకుందామా.

OTT Movie: బాబోయ్.. ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు డిమాండ్.. చూస్తే.. ఓటీటీలో సంచనలం ఈ సిరీస్..
Ajay Devgn

Updated on: Apr 21, 2025 | 8:27 PM

2022లో వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ సినీప్రియులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సిరీస్ కోసం ఆ స్టార్ హీరో భారీగా పారితోషికం తీసుకున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు తీసుకున్నాడట. అంటే మొత్తం రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆ స్టార్. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన నటుడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన శివయ, రన్ వే 34 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే అజయ్ దేవగన్ 2022లో రుద్ర ది ఏజ్ ఆఫ్ డార్క్ నెస్ చిత్రంతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇది అతడికి మొదటి వెబ్ సిరీస్. ఇందులో రాశి ఖన్నా, ఇషా డియోల్,, అశ్విని కల్సేకర్, అతుల్ కులకర్ణి, తరుణ్ గెహ్లాట్ ముఖ్య పాత్రలు పోషించారు.

‘రుద్ర – ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనేది ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ కోసం అజయ్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడట. అజయ్ దేవగన్ ఒక ఎపిసోడ్ కోసం రూ. 18 కోట్లు తీసుకున్నాడట. అంటే 7 ఎపిసోడ్లకు గాను ఆయన 125 కోట్ల రూపాయల ఫీజు అందుకున్నారు. ఇప్పటివరకు ఓటీటీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ‘రుద్ర – ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అజయ్ దేవగన్ డిసిపి రుద్రవీర్ సింగ్ పాత్రను పోషించారు. ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఏడు ఎపిసోడ్‌లు వేర్వేరు కథలను కలిగి ఉంటాయి. ప్రతి సిరీస్ వణుకుపుట్టించే సీన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. దీనికి రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహించారు. అలాగే కథను అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్, జయశీల బన్సాల్ అందించారు. ఇప్పటికీ ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..