Bigg Boss OTT: మరోసారి రెచ్చిపోయిన నటరాజ్‌ మాస్టర్‌.. బోరుమన్న సరయు.. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో కొనసాగుతోన్న గొడవలు..

|

Mar 03, 2022 | 6:46 AM

Bigg Boss Non-Stop: గత సీజన్లలో మాదిరిగానే నిమిషానికో రకంగా మారిపోతున్నారు బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌. ఒకరినొకరు సరదాగా మాట్లాడుకుంటూనే గొడవలకు దిగుతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ బూతులు మాట్లాడుకుంటున్నారు

Bigg Boss OTT: మరోసారి రెచ్చిపోయిన నటరాజ్‌ మాస్టర్‌.. బోరుమన్న సరయు.. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో కొనసాగుతోన్న గొడవలు..
Bigg Boss Non Stop
Follow us on

Bigg Boss Non-Stop: గత సీజన్లలో మాదిరిగానే నిమిషానికో రకంగా మారిపోతున్నారు బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌. ఒకరినొకరు సరదాగా మాట్లాడుకుంటూనే గొడవలకు దిగుతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ బూతులు మాట్లాడుకుంటున్నారు. దీంతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ (Bigg Boss Non-Stop) లోనూ కంటెస్టెంట్ల ఏడుపులు, పెడబొబబ్బలు నిత్యకృత్యమయ్యాయి. బుధవారం ఎపిసోడ్‌లోనూ ఇదే జరిగింది. గత సీజన్‌లో మొదటి వారంలోనే హౌస్‌ నుంచి వెళ్లిపోయిన సరయూ (Sarayu) బుధవారంకన్నీటిపర్యంతమయింది. తన మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్నారంటూ బోరున ఏడ్చేసింది సరయు. ముఖ్యంగా హమీదా ఎప్పుడూ తనను చులకనగా చూస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అఖిల్‌ వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సరయు నేరుగా హమీదా దగ్గరకు వెళ్లి ఇంకోసారి తన పై జోకులు చేయొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. మరోవైపు యాంకర్‌ శివ (Anchor Shiva) లేడీ కంటెస్టెంట్లతో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. హౌస్‌లో అడుగుపెట్టగానే అరియానాను పొగిడిన ఆయన ఆ తర్వాత బిందు మాధవిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె మీద నిత్యం పొగడ్తల వర్షం కురిపిస్తునే ఉన్నాడు.

రా అన్నావంటే తోలు తీస్తా!

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌, బిందు మాధవికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తాను ఫిజికల్‌ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. మరో పక్క నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. ‘రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా’ అంటూ యాంకర్‌ శివ పైకి దూసుకెళ్లాడు వెళ్లాడు మాస్టర్‌. దీంతో మిగతా కంటెస్టెంట్లు వారిని కూల్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఇక ఫైనల్‌గా మహేశ్‌, తేజస్వి, నటరాజ్‌, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మరి వీరిలో ఎవరు హౌస్‌ కెప్టెన్‌ అవుతారో చూడాలి.

Also read:RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై..

HSL Recruitment: విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..