Mr.Pregnant OTT: ఓటీటీలోకి బిగ్‏బాస్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

|

Sep 28, 2023 | 10:07 PM

శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదలై యువత నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ?.. అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

Mr.Pregnant OTT: ఓటీటీలోకి బిగ్‏బాస్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Mr.pregnant Movie
Follow us on

బుల్లితెరపై సీరియల్ హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. బిగ్‏బాస్ రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పటికే పలు చిత్రాలతో మెప్పించిన హీరో సోహైల్.. ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదలై యువత నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ?.. అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాన్ని అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. “మిస్టర్ ప్రెగ్నెంట్.. వినడానికే కొత్తగా ఉంది కదా. ఎంటర్టైన్మెంట్ కూడా కొత్తగానే ఉంటుంది. ఎమోషనల్ డ్రామా కోసం మీరంతా రెడీగా ఉండండి. అక్టోబర్ 6న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ప్రీమియర్ కానుంది” అంటూ ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే.. అటు ఆహాతోపాటు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆక్టోబర్ 6 నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో సోహైల్ సరసన రూపా కొడువాయూర్ కథనాయికగా నటించింది. అలాగే సుహాసిని, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష కీలకపాత్రలు పోషించగా.. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి నిర్మించారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.