- Telugu News Photo Gallery Cinema photos Stopped Akhil Agent ott Streaming due to distributors issues Telugu Entertainment Photos
Agent: అర్థాంతరంగా ఆగిపోయిన ఏజెంట్ OTT స్ట్రీమింగ్.. కారణం ఏంటంటే.?
అక్కినేని అఖిల్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సురేందర్ డైరెక్షన్లో తెరెకెక్కిన సినిమానే ఏజెంట్. అనిల్ సుంకర ప్రొడక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సీఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. పట్టుమని పది రోజులు కూడా ఆడకుండా.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌కు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో రోడ్డెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్.. ఈ మూవీ ప్రొడ్యూసర్ పై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. ఏజెంట్ కారణంగా.. తను నష్టపోయిన డబ్బును ..
Updated on: Sep 28, 2023 | 11:19 PM

అక్కినేని అఖిల్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సురేందర్ డైరెక్షన్లో తెరెకెక్కిన సినిమానే ఏజెంట్. అనిల్ సుంకర ప్రొడక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సీఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

పట్టుమని పది రోజులు కూడా ఆడకుండా.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌కు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో రోడ్డెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్.. ఈ మూవీ ప్రొడ్యూసర్ పై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.

ఏజెంట్ కారణంగా.. తను నష్టపోయిన డబ్బును .. తిరిగి దక్కించుకునేందుకు అనిల్ సుంకరపై.. కోర్టుల్లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై కూడా తాజాగా కోర్టు మెట్లెక్కారు.

ప్రొడ్యూసర్‌తో తనకున్న ఆర్థిక లావాదేవీలు తేలే వరకు.. ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఆపాలంటూ హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు విన్నవించారు.

ఇక తాజాగా వైజాగ్ సతీష్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ సినిమా స్ట్రీమింగ్ పై స్టే విధించినట్టు తెలుస్తోంది.





























