Nenu Student Sir: ఆహాలో రాబోతున్న ‘నేను స్టూడెంట్ సర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

|

Jul 12, 2023 | 3:02 PM

జూన్ 2న విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాతో అలనాటి తార భాగ్య శ్రీ కూతురు అవంతిక తెలుగు తెరకు పరిచయమైంది. అయితే థియేటర్లలో మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

Nenu Student Sir: ఆహాలో రాబోతున్న నేను స్టూడెంట్ సర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Nenu Student Sir
Follow us on

స్వాతిముత్యం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు బెల్లంకొండ గణేశ్. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇటీవలే తన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాంది సినిమాను నిర్మించిన సతీష్ ఈ మూవీని నిర్మించగా.. ఉప్పలపాటి రాఖీ దర్శకత్వం వహించారు. జూన్ 2న విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాతో అలనాటి తార భాగ్య శ్రీ కూతురు అవంతిక తెలుగు తెరకు పరిచయమైంది. అయితే థియేటర్లలో మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

ఈ సినిమాను ఈ నెల 14న నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా ప్రకటించింది. మరో రెండు రోజుల్లో నేను స్టూడెంట్ సర్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని కీలకపాత్రను పోషించగా.. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సుబ్బు అలియాస్ సుబ్బారావు (బెల్లంకొండ గణేశ్) ఫోరెన్సిక్ స్టూడెంట్. వివేకానంద యూనివర్సిటీలో చదువుతుండే అతనికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి రూ.90 వేలు దాచిపెట్టి ఐఫోన్ 12 సిరీస్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు పెట్టుకొని సొంత తమ్ముడిలా చూసుకుంటుంటాడు. ఓరోజు కాలేజీలో జరిగిన విద్యార్థుల అల్లర్ల విషయంలో అందరితోపాటు సుబ్బును పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో వారు విద్యార్థులందరి నుంచి ఫోన్స్ తీసుకుంటారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ తర్వాత తన ఫోన్ తీసుకునేందుకు స్టేషన్ కు వెళ్లగా.. సుబ్బుకు ఫోన్ దొరకదు. దాన్ని స్టేషన్లోనే పోలీసులే కొట్టేశారని అనుమానించిన సుబ్బు.. వారిపై కేసు పెట్టేందుకు కమిషనర్ అర్జున్ వాసుదేవన్ (సముద్రఖని) వద్దకు వెళ్లగా.. అతని ఫిర్యాదు తీసుకునేందుకు అంగీకరించడు వాసుదేవన్. దీంతో తన ఫోన్ ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు మరో ప్లాన్ వేసిన సుబ్బు.. కమిషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్ (అవంతిక దస్సాని)కు దగ్గరై తన ఫోన్ సొంతం చేసుకోవాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకోవడం.. అదే సమయంలో తన బ్యాంకు అకౌంట్లో రూ. 1.75 కోట్లు జమ కావడం జరుగుతుంది. సుబ్బును హత్య కేసులో ఇరికిందెవరు? అతని ఫోన్ దొరికిందా? ఫోన్ పోవడానికి కమిషనర్ కు ఏమైనా సంబంధం ఉందా? అసలు అతని ప్రేమకథ ఏమైందీ? అనేది కథ.