నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. భారీ అంచనాల మధ్య గత నెలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులలోనూ అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖండ మూవీ థియేటర్ల వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుదలై ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకుంది. అంతేకాకుండా.. రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
మరోవైపు ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక జనవరి 21న ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ విడుదల చేశారు. ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది అఖండ. బాలయ్య.. బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు ఓటీటీలోనూ అఖండ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా నందమూరి అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
అఖండ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలకృష్ణ మురళీ కృష్ణ అనే రైతు పాత్రతో పాటు అఖండ పాత్రలో అదరహో అనిపించారు . ఈ సినిమాలోని సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను తెలియజేసేలా మేకింగ్ వీడియో ఉంది. అంతేకాకుండా.. ఈ మేకింగ్ వీడియో బ్యాగ్రౌండ్ లో చక్కడి శివుడి పాటను ప్రేక్షకులకు అందించారు. మొత్తానికి అఖండ ఇటు వెండితెరపై.. అటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.
Watch #AkhandaRoarOnHotstar ?
Streaming on @DisneyPlusHS#Akhanda Exclusive Making Video:https://t.co/nOZevhTbXg#NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman@ItsMePragya @dwarakacreation@DisneyPlusHSTel pic.twitter.com/jYJK0e1443— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) January 23, 2022
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..