Arjun Malaika Wedding: కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన అర్జున్.. మలైకాతో పెళ్లి గురించి మనసులో మాట చెప్పేశాడుగా..

|

Dec 15, 2023 | 4:05 PM

మలైకా అరోరాతో అర్జున్ కపూర్ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి కరణ్ జోహార్ ప్రస్తావించాడు. కరణ్ జోహార్ వారి భవిష్యత్తు, వివాహ ప్రణాళికల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు . అప్పుడు అర్జున్ స్పందిస్తూ తన స్నేహితురాలు మలైకా అరోరాతో తన సంబంధం గురించి స్పష్టం చేస్తూనే.. తమ బంధంపై మలైకా దృక్కోణం కూడా ముఖ్యమని చెప్పాడు. అంతేకాదు అర్జున్ కపూర్ ఇంకా ఇలా అన్నాడు, 'కరణ్, నేను మీ షోకి వచ్చి నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను.

Arjun Malaika Wedding: కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన అర్జున్.. మలైకాతో పెళ్లి గురించి మనసులో మాట చెప్పేశాడుగా..
Arjun Malaika Wedding
Follow us on

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ బుల్లి తెరపై  పాపులర్ షో కాఫీ విత్ కరణ్ తాజా ఎపిసోడ్‌లో అర్జున్ కపూర్ , ఆదిత్య రాయ్ కపూర్ కనిపించారు. ఈ షోలో ఈ ఇద్దరు తారలు తమ సంబంధం గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అంతేకాదు షాకింగ్ విషయాలు కూడా వెల్లడించారు. మలైకా అరోరాతో అర్జున్ కపూర్ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి కరణ్ జోహార్ ప్రస్తావించాడు. కరణ్ జోహార్ వారి భవిష్యత్తు, వివాహ ప్రణాళికల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు . అప్పుడు అర్జున్ స్పందిస్తూ తన స్నేహితురాలు మలైకా అరోరాతో తన సంబంధం గురించి స్పష్టం చేస్తూనే.. తమ బంధంపై మలైకా దృక్కోణం కూడా ముఖ్యమని చెప్పాడు. అంతేకాదు అర్జున్ కపూర్ ఇంకా ఇలా అన్నాడు, ‘కరణ్, నేను మీ షోకి వచ్చి నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ‘కానీ నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా లేను, మలైకా ఇక్కడ లేకుండా నేను ఒక్కడిని మా ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడటం తప్పని అన్నాడు.

మేము పెళ్లి దశకు చేరుకున్న తర్వాత  అప్పుడు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నేను ఉన్న చోట  చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉండాల్సిన చోట సంతోషకరమైన  జీవితాన్ని జీవిస్తున్నామని తాము భావిస్తున్నట్లు వెల్లడించాడు.

అర్జున్ కపూర్, మలైకా జంట నిరంతరం ఇంటర్నెట్‌లో ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ విషయంపై అర్జున్ మాట్లాడుతూ.. తమ గురించి చేసే వ్యాఖ్యలు ఆ వ్యక్తుల పెంపకాన్ని, వారి సంస్కృతిని  తెలియజేస్తుందని చెప్పాడు. మమ్మల్ని కామెంట్ చేస్తూ తాము పదిమంది దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా మీకు తెలుసు. కనుక ఇలాంటి కామెంట్స్  తనను ప్రభావితం చేయవని అర్జున్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..