Anya’s Tutorial : ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ హారర్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తి పెంచే అన్య‌స్ ట్యుటోరియల్..

|

Jun 18, 2022 | 6:37 PM

ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన ఆహా..

Anyas Tutorial : ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ హారర్ వెబ్ సిరీస్.. ఆద్యంతం ఆసక్తి పెంచే అన్య‌స్ ట్యుటోరియల్..
Anya's Tutorial
Follow us on

ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఇప్పుడు మరో థ్రిల్లింగ్ హారర్ జోనర్ సిరీస్ తీసుకువచ్చింది. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ అన్య స్ ట్యుటోరియల్(Anya’s Tutorial). ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్ భాషలలో అతి త్వోరలోనే ఆహా లాంచ్ చేయనుంది. తాజాగా ఇటీవలే ఈ వెబ్ సిరీస్ టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు అన్య స్ ట్యుటోరియల్ టీమ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి