Anushka Sharma: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్ హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగాను రాణిస్తోంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనుష్క తన సొంత నిర్మాణ సంస్థను నడుపుతోంది. దీంతో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ ఇప్పటికే ఆకట్టుకుంది. ఈమేరకు అమోజాన్, నెట్‌ఫ్టిక్స్ సంస్థలతో అనుష్క నిర్మాణ సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నారు.
సుమారు రూ.400 కోట్లకు ఈ రెండు ఓటీటీలతో అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా నివేదికల ప్రకారం, క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ రాబోయే 18 నెలల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో 8 సినిమాలతోపాటు పలు వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నారు.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ రాబోయే మూడు ప్రాజెక్ట్‌లను ధృవీకరించింది. అయితే అమెజాన్ నుంచి ఇంకా అలాంటి నిర్ధారణ ఇంతవరకు రాలేదు. నటిగానే కాకుండా, అనుష్క శర్మ విజయవంతమైన వ్యాపారవేత్త కూడా రాణిస్తోంది. అనుష్క నిర్మాణ సంస్థ 2015లో మొదటి సినిమా NH-10ని రూపొందించింది. ఈసినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. విశేషమేమిటంటే, NH 10లో అనుష్క శర్మ కీలక పాత్రలో కనిపించింది.
మరోవైపు ఫిల్లౌరి, పారి అనే రెండు సినిమాలు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే నిర్మించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘కాలా’, ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ చిత్రాలు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్‌లోనే నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క శర్మ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
Also Read: Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..