న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). బ్రోచేవారెవరురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లో విడుదలైంది. ఇందులో నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించారు. మతాంతర వివాహం అనే సీరియస్ టాపిక్ ని ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందించారు డైరెక్టర్ వివేక్.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుందట… ఇప్పటికే అంటే సుందరానికీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది..
లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం నాని.. దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.