Bahishkarana Web Series: అంజలి మరో థ్రిల్ల‌ర్ తెలుగు వెబ్‌సిరీస్.. బహిష్కరణ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

యాబైకి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది తెలుగమ్మాయి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న మరో థ్రిల్లింగ్ తెలుగు వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ఆదివారం (జూన్ 16) అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Bahishkarana Web Series: అంజలి మరో థ్రిల్ల‌ర్ తెలుగు వెబ్‌సిరీస్.. బహిష్కరణ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Bahishkarana Telugu Web Series

Updated on: Jun 16, 2024 | 5:48 PM

యాబైకి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది తెలుగమ్మాయి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న రూపొందుతోన్న మరో థ్రిల్లింగ్ తెలుగు వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’.  ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ముఖేష్ ప్రజాపతి ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆదివారం (జూన్ 16) అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌తో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో మెప్పించనుందని తెలుస్తోంది. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.

ఫిక్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోన్న ‘బహిష్కరణ’ సిరీస్ త్వరలోనే ZEE 5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా అనూష పుంజాల, ఆర్ట్ డైరెక్టర్ గా ప్రియం క్రాంతి, కో – రైటర్ గా వంశీ కృష్ణ పొడపటి, డైలాగ్ రైటర్ గా శ్యామ్ చెన్ను, కో- డైరెక్టర్ గా రమేష్ బోనం, అసోసియేట్ డైరెక్టర్ గా ఆదిత్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జీ5 లో స్ట్రీమింగ్..

త్వరలోనే అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్..

 

జీ 5లో ఆకట్టుకుంటోన్న పరువు వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us