మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అమీ జాక్సన్. విక్రమ్ ఐ లాంటి హిట్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే ప్రేమ వ్యవహారం, పెళ్లి చేసుకోకుండానే తల్లిగా మారడంతో అమీ జాక్సన్ కెమెరాకు దూరమైపోయింది. సుమారు ఆరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్రిటిష్ బ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది అమీ జాక్సన్. ఏ ఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ సాహో ఫేమ్ అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన మిషన్ చాప్టర్ వన్ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో థియేటర్లలో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మిషన్ ఛాప్టర్ వన్ ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ ఈ యాక్షన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి మిషన్ ఛాప్టర్ వన్ ఓటీటీలో సందడి చేయనుంది. తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో మిషన్ ఛాప్టర్ వన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
మిషన్ చాప్టర్ వన్ చిత్రంలో అరుణ్ విజయ్, అమీ జాక్సన్‌లతో పాటు నిమిషా సజయన్, భరత్ భూపన్న, అభి హాసన్ తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు. సందీప్ కె. విజయ్ ఛాయాగ్రహణం, ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోన్న తన కూతురుని కలుసుకోవడానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటం చేశాడన్నదే మిషన్ ఛాప్టర్ వన్ కథ. సినిమాలోని ఉత్కంఠభరితమైన మలుపులు, జైలు అధికారిగా అమీ జాక్సన్‌తో పోరాట సన్నివేశాలు యాక్షన్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి.
Thanks for all the unconditional love and appreciation for #MissionChapter1 !!🙏🏽❤️
This pushes me to work even harder to always entertain you’ll..👍🏼
Love you all..🤗 pic.twitter.com/r7X8QnxlQz— ArunVijay (@arunvijayno1) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.