OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఆ సర్‌ప్రైజ్ కూడా ఉందండోయ్

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ కు ఈ విలేజ్ లవ్ స్టోరీ తెగ నచ్చేసింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి.. ఆ సర్‌ప్రైజ్ కూడా ఉందండోయ్
Raju Weds Rambai Movie

Updated on: Dec 15, 2025 | 6:05 PM

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో అదరగొట్టాడు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. చాలా పరిమితమైన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.17 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ షాక్ కు గురిచేసింది. థియేటర్లలో ఈ మూవీని చూసి చాలామంది ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు. ఇలా ప్రేక్షకుల మనసులను కదిలించిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18 నుంచి ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్‌ ఓటీటీ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో రాజు వెడ్స్ రాంబాయి మూవ పోస్టర్‌ రిలీజ్ చేసింది.

‘థియేటర్స్ లో మోత మోగించాం.. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మోత మోగించడానికి కూడా వస్తున్నాం విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ అండ్ విజన్ తో’ అని క్యాప్షన్ ఇచ్చింది ఈటీవీ విన్. ఇదే సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ కూడా చెప్పింది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఎక్స్‌టెండెడ్‌ కట్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంటే థియేటర్‌లో ఈ మూవీ రన్‌టైమ్‌ 2 గంటల 15 నిమిషాలు కాగా, ఎక్స్‌టెండెడ్‌ కట్‌లో మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజుల్లో ఈటీవీ విన్ లో రాజు వెడ్స్ రాంబాయి మూవీ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి