
ఎప్పటిలాగే గత వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్‌తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే వచ్చాయి. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కానీ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కాబట్టి ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఒక అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటారు. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా ఉంటారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నారా? అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? పోలీసుల విచారణలో బయటపడిన రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ పేరు తీయావర్ కులైగల్ నడుంగ. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. తెలుగులో మఫ్తీ పోలీసు గా విడుదలైంది. ఈ మూవీలో అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ మూవీని చూడొచ్చు. మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
No more waiting. No more guessing.
Dive into the investigation that keeps you on edge every second! ⚡Watch Theeyavar Kulai Nadunga now on SunNXT. @akarjunofficial ,@aishu_dil ,@sribalajivideos
[TheeyavarKulaiNadunga,SunNXT,TheeyavarKulaiNadungaOnSunNXT] pic.twitter.com/VSl9kii5d8
— SUN NXT (@sunnxt) December 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.