OTT Movie: 30 కోట్లతో తీస్తే 500 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

OTT Movie: 30 కోట్లతో తీస్తే 500 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie

Updated on: Aug 12, 2025 | 9:24 PM

పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోన్న ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా అద్బుతాలు చేస్తోంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు. బడ్జెట్ కూడా పెద్దగా వెచ్చించలేదు. వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా ఏమీ లేవు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అసలు రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించే చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రోజూ కోట్లాది రూపాయలను కలెక్ట్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. నేషనల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. జూలై 18న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా యువత ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. అందుకే ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేనప్పటికీ ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ పై ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? సైయారా.

 

ఇవి కూడా చదవండి

‘సైయారా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. సైయారా చిత్ర బృందంలో భాగమైన షానో శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబట్టి ఇదే అధికారిక రిలీజ్ డేట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. సైయారా చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. కొత్త నటులు అహన్ పాండే, అనీత్ పద్దా హీరో, హీరోయిన్లు గా నటించారు. స్టార్ హీరోలు లేని ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీన్ని ఇష్టపడి థియేటర్‌లో చూసిన వారు ఈ సినిమాను మళ్లీ ఇంట్లో చూడటానికి వేచి చూస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.