AHA Unstoppable: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా అన్‌స్టాపబుల్‌.. తగ్గేదేలే అంటోన్న బాలయ్య..

|

Jan 06, 2022 | 9:36 AM

AHA Unstoppable: 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్‌ టాక్‌షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు మంచి బజ్‌..

AHA Unstoppable: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా అన్‌స్టాపబుల్‌.. తగ్గేదేలే అంటోన్న బాలయ్య..
Aha
Follow us on

AHA Unstoppable: ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్‌ టాక్‌షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు మంచి బజ్‌ ఏర్పడింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తొలి సీజన్‌లో భాగంగా మొత్తం 10 ఎపిసోడ్‌లు ముగిశాయి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో నిర్వహించిన షోతో తొలి సీజన్‌ను ముగించారు మేకర్స్‌. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ టాక్‌షో అరుదైన ఘనతను సాధించింది. IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్‌ షోకి ఇలాంటి గౌరవం లభించడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదేమో. ఎపిసోడ్‌, ఎపిసోడ్‌కు టాప్‌ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్‌ IMDB జాబితాలో 5వ స్థానం దక్కించుకుంది.

దీంతో సెకండ్ సీజన్‌పై మరింత ఆసక్తి నెలకొంది. తొలి సీజన్‌కు మంచి టాక్‌ రావడంతో రెండో సీజన్‌ను వీలైనంత త్వరగా లైన్‌లో పెట్టాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు పమాచారం. ఇదిలా ఉంటే గతేడాది అఖండతో సెన్సేషన్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. తాజాగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

Also Read: Rashi Khanna: యోధ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్.. బాలీవుడ్‏లోకి రాశీ ఖన్నా రీఎంట్రీ..

IND vs SA: రిషబ్ పంత్ ఇదేం ఆట.. ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్..

IND vs SA: రిషబ్ పంత్ ఇదేం ఆట.. ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్..