ప్రేక్షకులకు 100 % వినోదాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, గేమ్ షోస్, టాక్ షోస్ స్ట్రీమింగ్ చేస్తూ… అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షాకదరణ పొందింది. అలాగే ఇతర భాషల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను తీసుకువస్తుంది. ఆహా.. డైస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన అల్లుడు గారు సిరీస్ తర్వాత ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంత్, రమ్య పసుపులేటి ప్రధానపాత్రలు పోషిస్తు్న్నారు.
ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి స్నేహం దొరకడం చాలా కష్టం.. అలాంటి సమయంలో ఒక స్నేహం చెంతకు రావడం.. ఆ స్నేహంతో జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ వెబ్ సిరీస్. స్నేహం, బాధ్యతలు, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, కొత్త ఆఫీస్, కొత్త మనుషులు ఇలాంటి ఎన్నో విషయాలను అద్దం పట్టినట్లు చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ మే చివరివారంలో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో తాను సరికొత్త పాత్ర చేయబోతున్నానని.. అభిమానులకు నచ్చుతుందని తెలిపారు సిరి హనుమంత్..
Let the fun begin!??
Friendship – gurthundipoyela
Fun – unlimited
Drama – kavalsinantha
And much, much more?#BFF,An aha original show, coming soon!#SiriHanumanth #RamyaPasupuleti @DiceMediaIndia @TamadaMedia @DaburHoney_Ind @BhargavMacharla @PatnaikPraneeta @AnjaliiDream pic.twitter.com/hXS0hM6iUg— ahavideoin (@ahavideoIN) May 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి
Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్
MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..