Aha Unstoppable: డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకి.. ఆలస్యంగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్..

ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే ప్రభాస్ అభిమానుల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడంతో ఆహా యాప్ క్రాష్ అయింది. ఈ ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Aha Unstoppable: డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకి.. ఆలస్యంగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్..
Aha Unstoppable Prabhas Episode

Updated on: Dec 29, 2022 | 10:32 PM

Prabhas Unstoppable: ఈరోజు రాత్రి 9 గంటలకి ఆహాలో బాలయ్యతో ప్రభాస్‌ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ, డార్లింగ్ అభిమానుల దెబ్బకు యాప్‌ క్రాష్ అయినట్లు ఆహా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే ప్రభాస్ అభిమానుల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడంతో ఆహా యాప్ క్రాష్ అయింది. ఈ ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఎపిసోడ్ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ ప్రభాస్ ఎపిసోడ్‌పై అటు అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగింది.

“మీ ప్రేమ అనంతం డార్లింగ్స్! మా యాప్ ఆఫ్‌లైన్‌లో ఉంది. కానీ మా ప్రేమ కాదు. మేం దాన్ని సరిచేసేందుకు మాకు కొంచెం సమయం ఇవ్వండి. మేం కొన్ని క్షణాల్లో మళ్లీ కలుస్తాం! #PrabhasOnAHA” అంటూ ఆహా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆహా యాప్‌ ఇలా క్రాష్ అవ్వడం ఇదే తొలిసారి. ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగంపై ఫ్యాన్స్‌లో నెలకొన్న ఆసక్తితోనే యాప్ క్రాష్‌కు దారితీశాయి. ఇదే విషయాన్ని ఆహా కూడా కన్మాఫాం చేసింది.

రెండవ భాగం జనవరి 6న ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో మరో ప్రత్యేక ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ ఎపిసోడ్ జనవరిలో స్ట్రీమింగ్ కానుంది.