Aha OTT: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ ఝా తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగులో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(Aha OTT)లో ప్రసారం కానుంది. 1991-96 మధ్య ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల దగ్గర నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, ముంబై పేలుళ్లు.. ఇలా ఆయన జీవితంలోనూ ప్రతీ చాప్టర్‌ను.. ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారు. వినయ్ సత్‌పతి రాసిన ‘ది హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఈ వెబ్ సిరీస్ అప్‌లాస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
పీవీ నరసింహరావు వెబ్ సిరీస్ గురించి ప్రకాశ్ ఝా మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు మహోన్నతమైన వ్యక్తి అని.. ఈ వెబ్ సిరీస్ ఆయన వ్యక్తిత్వంలోని ప్రతి కోణాన్ని చూపిస్తుందన్నారు. ప్రస్తుతం రచనా కార్యక్రమాలు జరుగుతున్నాయని, నటీనటులను ఖరారు చేయలేదన్నారు. నవ భారతాన్ని నిర్మించిన నాయకుడు పీపీ నరసింహారావు అని ఆయన కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల పట్ల నరసింహారావు అవలంభించిన విధానాలు.. ఆర్థిక సరళీకరణ నిర్ణయాలు.. వీటి వెనుక ఎవరున్నారు.. ఏ పరిస్థితిలో ఆయన నిర్ణయం తీసుకున్నారనేది ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సిరీస్ ద్వారా ముఖ్యమైన పాత్రలను తెరపైకి తీసుకువస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌లో ఇండియన్ ఎంబసీని మొదటగా స్థాపించారని చాలా కొద్ది మందికి తెలుసు. దీనితో ఐక్యరాజ్యసమితిలో చాలా సంవత్సరాలు వ్యతిరేకించారు.. మేము అలాంటి అనేక ఆసక్తికరమైన కథనాలను తెరపైకి తెస్తామని ప్రకాశ్ ఝా తెలిపారు.
కాగా తొలి తెలుగు ఓటీటీ సంస్థగా మొదలై సంచలనంగా మారింది ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహా(Aha OTT). సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన టాక్ షోలతో ప్రేక్షకులను పెంచుకుంటూ పోతోందీ ఆహా. మొదలైన కేవలం 21 నెలల్లోనే ఏకంగా 11 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో ఆహా యాప్ టాప్ గేర్‌లో దూసుకుపోతూ బడా ఓటీటీ సంస్థలకు సైతం గట్టి పోటీనిస్తోంది. క్వాలిటీ కంటెంట్, మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుండడం వల్లే ఆహాకు ఈ రేంజ్‌లో క్రేజ్ పెరుగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేశారు. పీవీ నరసిహారావు సంఘ సంస్కరణకర్తగా, బహుభాషావేత్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ, ఆర్ధికవేత్తగా చరిత్రలో నిలిచారు. పాములపర్తి వేంకట నరసింహారావు 1991 నుంచి 96 వరకు భారత తొమ్మిదవ ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన పదవీకాలంలో కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారు.
జూన్ 28, 1921 జన్మించిన పీవీ నరసింహారావు డిసెంబర్ 23, 2004న తుదిశ్వాస విడిచారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పి.వి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తగినంతా సంఖ్యాబలం లేనప్పటికీ.. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించిన ఘనత ఆయనకే సొంతం.
Also Read: