ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా కంటెంట్ ఆకట్టుకునేలా ఉండే సినిమాలు ఆహాలో బోలెడన్ని ఉన్నాయి. సినిమాలే కాదు అలరించే వెబ్ సిరీస్ లు, ఆసక్తికర టాక్ షోలు, అబ్బురపరిచే గేమ్ షోలతో దూసుకుపోతుంది ఆహా. ఈ క్రమంలోనే ఆహాలో భామాకలాపం అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. భామాకలాపం సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భామాకలాపం 1 మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఇక ఇప్పుడు భామాకలాపం 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది..
ఇక ఇప్పుడు మరోసారితో భామాకలాపం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. భామాకలాపం 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అభిమన్యు తాడిమేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు భామాకలాపం 2 పై అంచనాలు పెరిగిపోయాయి.
తాజాగా విడుదలైన భామాకలాపం 2 వీడియో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ప్రియమణి, శరణ్య ఎదో పెద్ద దొంగతనానికి వెళ్తున్నట్టు చూపించారు. చెరో 25 లక్షలు. ఇద్దరికి కలిపి 50 లక్షలు. ఎన్ని ఇడ్లీలు అమ్మితే అంత డబ్బు వస్తుంది అంటూ శరణ్య చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేనంటావా..? అని ప్రియమణి అడగడం.. దానికి ఇదంతా మొదలు పెట్టింది మీరే కదా.. మీరు మాములు హౌస్ వైఫ్ కాదు.. డేంజరస్ హౌస్ వైఫ్ అంటూ శరణ్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
The CRAZIEST Partners re-unite to serve you all ‘A Delicious Heist Feast’ yet again😈
Glimpse of #Bhamakalapam2 🔪 OUT NOW
SERVING SOON 🤩@ahavideoIN #Priyamani #AbhimanyuTadimeti @prashanthvihari #DeepakYaragera #Bapineedu @sudheer_ed @WeDreamFarmers @sprite_india pic.twitter.com/VdO4pHLYKp
— ahavideoin (@ahavideoIN) January 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.