Vijay Devarakonda: అమెజాన్ ప్రైమ్‏లో ‘ది టుమారో వార్’ సిరీస్ స్ట్రీమింగ్.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..

ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్‏ఫామ్స్ పై వెబ్ సిరీస్‏ల హవా కొనసాగుతుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో స్టార్ నటీనటులు సైతం... డిజిటల్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

Vijay Devarakonda: అమెజాన్ ప్రైమ్‏లో ది టుమారో వార్ సిరీస్ స్ట్రీమింగ్.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..
The Tomorrow War

Updated on: Jul 03, 2021 | 5:02 PM

ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్‏ఫామ్స్ పై వెబ్ సిరీస్‏ల హవా కొనసాగుతుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో స్టార్ నటీనటులు సైతం… డిజిటల్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్  కోసం సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. స్టార్ హీరోలు సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా… యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది టుమారో వార్’ సిరీస్ కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్నారట. క్రిస్ ప్రాట్, వైవోన్ స్ట్రాహూవ్స్కీ ప్రధాన పాత్రలో నటించిన ‘ది టుమారో వార్’ సిరీస్ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. దీనిని మీరు తెలుగు, తమిళ భాషలలో కూడా చూడవచ్చు అంటూ ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ.

ట్వీట్..

క్రిస్ ప్రాట్, వైవోన్ స్ట్రాహూవ్స్కీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ను డైరెక్టర్ క్రిస్ మెక్కే తెరకెక్కించాడు. 2051లో గ్రహాంతరవాసులకు..జీవరాశులకు మధ్య జరిగే ప్రపంచ యుద్దం నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్ గా నటిస్తుండగా.. కరణ్ జోహార్, ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఆదాయంపై కరోనా పంజా.. తగ్గిన ప్రయాణికులు.. తెరుచుకోని దుకాణాలు!

Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి.. ఏకగ్రీవంగా ఎన్నికున్న లెజిస్లేచర్ పార్టీ

Vikram Movie: “విక్రమ్” సినిమాపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్.. కమల్ కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్..