ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరిగిపోయింది. సరికొత్త సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సత్తా చాటుతున్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ సక్సెస్ అవుతున్నారు నటీనటులు. ఇప్పటికే యంగ్ హీరోస్.. హీరోయిన్స్ ఓటీటీలో నటించి మెప్పించారు. ఇప్పటికే నయన్, సమంత, తమన్నా.. వెబ్ సిరీస్ ద్వారా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్ సైతం ఓటీటీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో సైతం ఓటీటీ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్.
తెలుగు, హిందీ, తమిళం ఇలా భాషతో సంబంధం లేకుండా ఓటీటీలు థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్నాయి. తాజాగా నితిన్ సైతం ఓటీటీ కోసం సినిమా లేదా వెబ్ సిరీస్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలతో స్పీడ్ మీదున్నాడు. ఇటీవలే మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మంచిహిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక సినిమాలతో పాటే.. నితిన్ ఓటీటీ కోసం సినిమా లేదా వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే పలువురు రచయితలు స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారని టాక్. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Krithi Shetty: స్పీడ్ పెంచిన ఉప్పెన బ్యూటీ.. మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి ?..
Kashish Khan: ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. హీరోయిన్ కశిష్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..