Nani: ఓటీటీ విడుదల కానున్న న్యాచురల్ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

|

Apr 28, 2022 | 6:31 AM

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని (Nani)..

Nani: ఓటీటీ విడుదల కానున్న న్యాచురల్ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
Nani
Follow us on

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని (Nani).. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. అంటే సుందరానికీ, దసరా సినిమాల షూటింగ్‏లో ఉన్నాడు న్యాచురల్ స్టార్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాని సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందట. ఇప్పటికే ఈ హీరో నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో థియేటర్లలో కాకుండా.. ఈ రెండు చిత్రాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇక ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు నాని సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నాని సొంత ప్రొడక్షన్‏ బ్యానర్ పై ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న సినిమా మీట్ క్యూట్. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఐదు విభిన్న కథనాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నటుడు సత్యరాజ్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, రుహాని శర్మ, ఆదా శర్మ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట నాని. అయితే ఇప్పటివరకు ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..