Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

'హిందీ' భాషపై సినీ ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర నటుల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ సుదీప్ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన ట్వీట్స్ హీట్ పుట్టించాయి.

Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..
Ajay Devgn Vs Sudeep
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 27, 2022 | 9:36 PM

‘హిందీ’ భాషకు సంబంధించిన వివాదంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌, శాండిల్‌వుడ్‌ కిచ్చా సుదీప్‌ మధ్య ట్వీట్‌వార్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీ జాతీయభాష కాదని సుదీప్‌ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై దుమారం చెలరేగింది. హిందీ జాతీయ భాష కానప్పుడు… మీ కన్నడ సినిమాలను హిందీలో డబ్‌ చేస్తున్నారు కదా ? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది…  అంటూ సుదీప్‌కు కౌంటరిచ్చారు అజయ్‌ దేవగన్‌. అయితే తన ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని అజయ్‌దేవగన్‌కు జవాబిచ్చారు సుదీప్‌. హిందీ అంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. కేజీఎఫ్‌ సినిమా నార్త్‌ ఇండియాలో సూపర్‌ హిట్టయిన విషయాన్ని ప్రస్తావించారు సుదీప్‌. కన్నడ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్లో తీశారని, ఈవిషయం హిందీ జాతీయ భాష కాదని నిరూపించిందని అన్నారు సుదీప్‌. మీరు హిందీలో పెట్టిన ట్వీట్‌ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్‌? చదవగలరా అంటూ ప్రశ్నించాడు సుదీప్. అయినా మనమంతా భారతీయులమే కదా.. నేను రెచ్చగొట్టాలని చెప్పడం లేదంటూ పేర్కొన్నాడు.

ట్రాన్స్​లేషన్​లో పొరపాట్ల వల్ల ఏదైనా తప్పుగా ప్రచారమై ఉంటుందని కిచ్చా సుదీప్‌కు రిప్లై ఇచ్చారు అజయ్ దేవగన్. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని తాను భావిస్తుంటానని… అన్ని భాషలను మేం గౌరవిస్తాం. అందరూ అలాగే గౌరవించాలని అనుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. దీనికి మరోసారి కౌంటరిచ్చారు సుదీప్. “ట్రాన్స్​లేషన్లు, వివరణలు మన ఆలోచన తీరులోనే ఉంటాయి. నేను మీపై నిందలు వేయట్లేదు. కానీ, మంచి విషయాల్లో మీ నుంచి ట్వీట్ వచ్చి ఉంటే నేను అభినందించేవాడిని. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం” అని సుదీప్ తెలిపారు.

తెలుగు, కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా హిట్‌ అవుతుంటే, ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతుంటే .. దక్షిణాది భాషల్లో డబ్‌ చేసిన హిందీ సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని అన్నారు సుదీప్. సుదీప్‌ వ్యాఖ్యలపై అజయ్‌దేవగన్‌కు కౌంటర్ ఇవ్వడంతో ఈ టాపిక్ నెట్టింట హీట్ రేపింది.

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న