Nenu meeku Baaga Kavalsinavaadini: ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం.. నేను మీకు కావాల్సినవాడిని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్ కథానాయికగా నటించి మెప్పించింది. ఇందులో సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ కీలకపాత్రలలో నటించారు.

Nenu meeku Baaga Kavalsinavaadini: ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం.. నేను మీకు కావాల్సినవాడిని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kiran Abbavaram

Updated on: Oct 11, 2022 | 7:06 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. డైరెక్టర్ శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ సినిమా గత నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‍గా వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్ కథానాయికగా నటించి మెప్పించింది. ఇందులో సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ మూవీకి మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అక్టోబర్ 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన కథానాయిక ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోతుంది. ఇంట్లో వాళ్లకు ముఖం చూపించుకోలేక జీవితాన్ని భారంగా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసవుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవర్ అయిన వివేక్ (కిరణ్ అబ్బవరం) ఎంట్రీ ఇస్తాడు.

ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం.. ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది ? వీరి జీవితంలో ఎలాంటి సంఘటలను ఎదురయ్యి అనేది నేను మీకు బాగా కావాల్సినవాడిని. థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ కుర్రాడు ఓటీటీలో అలరిస్తాడేమో చూడాలి.