Daggubati Rana: ‘రానానాయుడు ఒంటరిగా చూడండి.. ఫ్యామిలీతో మాత్రం వద్దు’.. సినీ ప్రియులకు రానా రిక్వెస్ట్..

|

Mar 08, 2023 | 10:43 AM

ఇప్పటికే విడుదలైన టీజర్ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచింది. మార్చి 10 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Daggubati Rana: రానానాయుడు ఒంటరిగా చూడండి.. ఫ్యామిలీతో మాత్రం వద్దు.. సినీ ప్రియులకు రానా రిక్వెస్ట్..
Rana
Follow us on

పాన్ ఇండియా స్టార్ హీరో దగ్గుబాటి రానా.. విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తోన్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ద్వారా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోకి అరంగేట్రం చేస్తున్నారు అబ్బాయ్.. బాబాయ్. తెలుగుతోపాటు.. హిందీలోనూ ఈ సిరీస్‏ను నిర్మించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్. ఇందులో వీరిద్దరు తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. నేరం చేసి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన క్రిమినల్‏గా వెంకీ పాత్ర ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించనున్నారు. తండ్రిని విపరీతంగా ద్వేషించే కొడుకుగా రానా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచింది. మార్చి 10 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రానా మాట్లాడుతూ… “ఒక నటుడిగా ప్రతిసారి కొత్తగా ప్రయత్నించాలనుకుంటాను. పాటలు, ఫైట్లు లేకుంటే సినిమాలు ఆడవు అనుకునే సమయంలో నా తొలి చిత్రం చేశాను. ఇక్కడి హీరోస్ హిందీలో సినిమాలు చేస్తే చూడరనుకుంటున్నప్పుడు నా రెండో సినిమా హిందీలో చేశాను. ఇక్కడ సినిమా చేస్తే హిందీలో ఆడదు. అక్కడ చేస్తే ఇక్కడ ఆడదు అనే రోజులు పోయాయి. ఇప్పుడు మనమే డబ్బింగ్ చిత్రాల్లా వెళ్లి ప్రపంచాన్ని జయించేస్తున్నాం.

ఇప్పుడు రానా సిరీస్ తో మేము మరో ముందడుగు వేస్తున్నాం. ఇందులో నా పాత్ర.. బాబాయ్ పాత్ర కొత్తగా ఉంటాయి. మా నిజ జీవితాలకు పూర్తి భిన్నమైన పాత్రలు ఇవి. చాలా డార్క్ షేడ్స్ ఉంటాయి. ఇద్దరూ మాట్లాడుకుంటే ఒకరినొకరు చంపేసుకుంటారేమో అన్నట్లుగా కనిపిస్తుంటాయి. ఈ సిరీస్ ను ఒంటరిగానే చూడండి. కుటుంబంతో కలిసి మాత్రం చూడొద్దు.” అంటూ చెప్పుకొచ్చారు రానా. చివరిసారిగా సాయి పల్లవి నటించి విరాట పర్వం చిత్రంలో కనిపించారు రానా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.