AHA Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తొలిసారి యాంకర్‌గా మారి నటించిన షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌షోకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఓటీటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక టాక్ షోకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్‌పీ దక్కించుకుందీ షో. బాలకృష్ణ మార్క్ పంచ్ డైలాగ్‌లతో షో ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఇలా ఈ టాక్ షో తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిర్వాహకులు ప్రస్తుతం సీజన్2 మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు నుంచి ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మేకర్స్ అన్ని పనులు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంకా అధికారికంగా ప్రకటన కూడా రాని ఈ షోకు సంబంధించి ఇప్పుడే ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సమాచారం ప్రకారం సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్‌లో మెగా స్టార్ చిరంజీవి తొలి గెస్ట్‌గా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
సెకండ్ సీజన్‌ను గ్రాండ్ లాంచ్ చేయాలంటే మెగాస్టార్ అయితేనే కుదురుతుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..