AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్టీఆర్ విష్ణుమూర్తి పాత్ర.. ఆ నాలుగింటిలో రెండు చేతులు ఎవరివంటే..?

నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి పాత్రలకు ప్రాణం పోశారు. విష్ణుమూర్తి గెటప్‌లో కనిపించే నాలుగు చేతుల్లోని పై రెండు చేతులు, వాటిలో శంఖు, చక్రాలు పట్టుకున్న చేతులు ఎవరివో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆయన సహకారంతోనే ఎన్టీఆర్ ఆ పాత్రలను అద్భుతంగా పోషించగలిగారు.

Tollywood: ఎన్టీఆర్ విష్ణుమూర్తి పాత్ర.. ఆ నాలుగింటిలో రెండు చేతులు ఎవరివంటే..?
NTR Vishnu role
Ram Naramaneni
|

Updated on: Sep 07, 2026 | 4:09 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో నటరత్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థానం అద్వితీయం. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు, దైవాల గెటప్‌లకు ఆయన పర్యాయపదంగా నిలిచారు. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్నో చిత్రాల్లో పోషించి కృష్ణుడు అంటే ఎన్టీఆరే అన్నంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన మరికొన్ని సినిమాల్లో విష్ణుమూర్తి గెటప్‌లోనూ దర్శనమిచ్చారు. సాధారణంగా విష్ణుమూర్తిని నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు. మరి ఎన్టీఆర్ విష్ణు గెటప్‌లో కనిపించినప్పుడు ఈ అదనపు రెండు చేతులను ఎలా నిర్వహించారు అనే ప్రశ్న చాలా మందికి ఉండి ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

వాహిని స్టూడియోలో పెయింటింగ్ శాఖకు అధిపతిగా ఉన్న జయరామిరెడ్డి అనే వ్యక్తి ఈ అద్భుతానికి కారకుడు. ఎన్టీఆర్ చేతులకు సరిపోయే, సహజంగా కనిపించే చేతుల కోసం వెతికి వెతికి చివరికి జయరామిరెడ్డి చేతుల్ని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ విష్ణుమూర్తిగా కనిపించిన ప్రతి సినిమాలోనూ, స్క్రీన్ పైన కనిపించే నాలుగు చేతుల్లో పైకి ఎత్తిన రెండు చేతులు జయరామిరెడ్డివే. ఆయన చేతుల్లోనే శంఖం, చక్రం వంటి ఆయుధాలు ఉండేవి. అందువల్లే, ఎన్టీఆర్ కాల్‌షీట్‌లతో పాటు జయరామిరెడ్డి డేట్స్‌ను కూడా చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా తీసుకునేవారు. ఈ అంకితభావం, సృజనాత్మక పరిష్కారం వల్లే ఎన్టీఆర్ విష్ణుమూర్తి పాత్రలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. అయితే జయరామిరెడ్డి ఫోటో అందుబాటులో లేకపోవడంతో..  మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం.

(ఈ సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us